కృత్రిమ ఉపగ్రహాల వల్ల అనుకున్న దానికంటే ఎక్కువే నష్టం!

ABN , First Publish Date - 2021-03-30T12:17:17+05:30 IST

మనం అంతరిక్షంలోకి పంపే కృత్రిమ ఉపగ్రహాలు, రాకెట్లు పంపినప్పుడు మధ్యలో విడిపోయే భాగాల వల్ల అనుకున్న దానికంటే ఎక్కువే నష్టం వాటిల్లుతోందని తాజా సర్వే తేల్చింది.

కృత్రిమ ఉపగ్రహాల వల్ల అనుకున్న దానికంటే ఎక్కువే నష్టం!

ఇంటర్నెట్ డెస్క్: మనం అంతరిక్షంలోకి పంపే కృత్రిమ ఉపగ్రహాలు, రాకెట్లు పంపినప్పుడు మధ్యలో విడిపోయే భాగాల వల్ల అనుకున్న దానికంటే ఎక్కువే నష్టం వాటిల్లుతోందని తాజా సర్వే తేల్చింది. వీటి వల్ల రాత్రిపూట మామూలుగా ఉండాల్సిన వెలుతురు కంటే ఆకాశం కనీసం 10శాతం ఎక్కువ కాంతివంతంగా ఉంటోందని తెలుస్తోంది. భూమి చుట్టూ తిరిగే వస్తువుల సంఖ్య రాత్రిపూట ఆకాశాన్ని సుమారు 10శాతం కాంతివంతం చేస్తుందని, సాధారణంగా ఇంత కాంతి ఉండదని పరిశోధకులు చెప్తున్నారు. దీనిపై చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భూమి చుట్టూ తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలు, పనిచేయడం మానేసినవి, రాకెట్ల శకలాలు తదితరాలన్నీ కలిపి రాత్రిపూట ఆకాశాన్ని కాంతివంతం చేస్తున్నాయట. అంటే మనం రోజూ చూసే ఆకాశంలో నిజానికి అంత వెలుతురు ఉండకూడదన్నమాట.

Updated Date - 2021-03-30T12:17:17+05:30 IST