కావలసినవి: శనగపిండి - పావు కప్పు, నీళ్లు - ఒక గ్లాసు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పచ్చి మామిడికాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.
తయారీ: ముందుగా జీలకర్రను వేగించాలి. పుదీనాను కట్ చేసుకోవాలి. మామిడికాయ సన్నగా తురుముకోవాలి. తరువాత వాటిని ఒక పాత్రలోకి తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. నిమ్మరసం వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పుదీనా ఆకులతో గార్నిష్ చేయాలి. ఐస్‌క్యూబ్స్ వేసి కూల్ కూల్‌గా టేస్ట్ చేయాలి.