Abn logo
May 11 2021 @ 04:09AM

సతీశ్‌చంద్రకు జేఎన్‌టీయూకే వీసీ బాధ్యతలు

అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ కాకినాడ వైఎస్‌ చాన్స్‌లర్‌ బాధ్యతలను ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌చంద్రకు అప్పగించింది. ఈమేరకు ఆయన్ను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వీసీగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. జేఎన్‌టీయూకేకు వీసీగా ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజును ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ నియామకంపై హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు రావడంతో ప్రభుత్వం నియామకాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దీంతో తాత్కాలికంగా ఆ బాధ్యతలను స్పెషల్‌ సీఎ్‌సకు అప్పగించింది.

Advertisement