Abn logo
Aug 10 2020 @ 08:57AM

మళ్లీ పాత దారిలోకే..?

కెరీర్ ప్రారంభంలో ‘దొంగ‌ల బండి, రామ‌దండు’ వంటి కామెడి జోనర్ సినిమాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న. ఆ త‌ర్వాత ‘శ‌త‌మానం భ‌వ‌తి, శ్రీనివాస క‌ల్యాణం, ఎంత మంచివాడ‌వురా’ చిత్రాల‌తో ఫ్యామిలీ డైరెక్ట‌ర్ అనే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ ద‌ర్శ‌కుడు మళ్లీ రూటు మారుస్తున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కూ స‌తీశ్ వేగేశ్న ఎందుకు రూటు మారుస్తున్నారు? అనే విష‌యంలోకి వెళితే.. స‌తీశ్ వేగేశ్న త్వ‌ర‌లోనే త‌న కుమారుడు స‌మీర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమాను చేయాల‌నుకుంటున్నార‌ట‌. సమీర్‌తో ల‌వ్‌స్టోరి స్లైల్లో కాకుండా కామెడీ జోన‌ర్‌లో సినిమాను తెర‌కెక్కించాల‌ని స‌తీశ్ వేగేశ్న ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌ల‌పై సతీశ్ వేగేశ్న ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement