Sep 24 2021 @ 10:30AM

అప్పుడు దిలీప్, బిగ్ బీ.. ఇప్పుడు రణబీర్, రణవీర్ : శత్రుఘ్నసిన్హ

అప్పట్లో బాలీవుడ్ లో దిలీప్ కుమార్, అమితాబ్, ధర్మేంద్ర, రాజేశ్ ఖన్నా లాంటి హీరోలు.. ఎంతో కష్టపడి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఆ క్రమంలో వారు చాలా కష్టాలు పడ్డారు. ఇక ఇప్పుడు ఈ జెనరేషన్ హీరోల్లో రణబీర్, రణవీర్ , అక్షయ్ కుమార్ లాంటివారు సరిగ్గా వారి తరహాలోనే కష్టపడి తమ ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఓ మీడియా ఇంటరాక్ట్ లో బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అండ్ పొలిటీషియన్ శత్రుఘ్న సిన్హ తెలిపారు. ‘అప్పటి హీరోలు ఎంతో ఉన్నతమైన వ్యక్తత్వంతో .. కష్టపడి సూపర్ స్టార్స్ గా ఎదిగారు. చూస్తుంటే.. ఈ జనరేషన్ లో రణబీర్, రణవీర్ , అక్షయ్ కుమార్ లాంటి వారు నాకు అలాగే కనిపిస్తున్నారు’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Bollywoodమరిన్ని...