టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం భారత షెడ్యూల్ ఇదే

ABN , First Publish Date - 2021-08-07T07:38:05+05:30 IST

టోక్యో ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. పోటీలు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఈ దఫా టోర్నీలో ..

టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం భారత షెడ్యూల్ ఇదే

టోక్యో ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. పోటీలు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఈ దఫా టోర్నీలో భారత్‌కు కనీసం ఒక్కటంటే ఒక్క పసిడి కూడా దక్కలేదు. ఒక్క ఆటగాడు కూడా గోల్డ్ మెడల్‌ను ముద్దాడలేదు. 2 రజత పతకాలు.. 3 కాంస్య పతకాలు మాత్రమే భారత క్రీడాకారులు సాధించగలిగారు. ఈ క్రమంలోనే శనివారం ఒలింపిక్ పోటీల్లో మరికొందరు భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నారు. అందులో మొదటగా.. గోల్ఫ్‌లో దీక్షా డాగర్ పాల్గొనబోతోంది. తెల్లవారుజామున 4:17 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రారంభకానున్న గోల్ఫ్ ఉమెన్స్ రౌండ్ 4లో ఆమె పాల్గొనబోతోంది. అలాగే మరో గోల్ఫర్ అదితి అశోక్ కూడా ఇదే రౌండ్ 4లో ఆడనుంది. తెల్లవారుజామను 4:48 గంటలకు ఆమె మ్యాచ్ ప్రారంభమవుతుంది.


ఇదిలా ఉంటే ఈ దఫా టోర్నీలో దాదాపు 90 దేశాల వరకు ఏదో ఒక పతకం సాధించాయి. బంగారు పతకాలు అత్యధికంగా సాధించిన చైనా.. పతకాల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉండగా.. అమెరికా, జపాన్ ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి.


ఇక శుక్రవారం జరిగిన 65 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓడిన భారత రెజ్లర్ భజరంగ పూనియా కాంస్యం కోసం నేడు పోటీ పడనున్నాడు. పూనియా మ్యాచ్ మధ్యాహ్నం 3:55 గంటలకు జరుగుతుంది. ఇక చివరిగా జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా తన అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నాడు. ఈ పోటీలు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది.




చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో అదితి అశోక్:

ఒలింపిక్స్‌లో భారత గోల్ఫ్ క్రీడాకారిణి​ అదితి అశోక్​ ఎవరూ ఊహించని విధంగా పతకం సాధించే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఆమె ఫైనల్‌కు చేరింది. మూడు రౌండ్లు ముగిసేసరి అదితి రెండో స్థానంలో నిలిచింది. అసలు ఈ విభాగంలో భారత్ రాణించడం కూడా ఇదే తొలిసారి. శుక్రవారం మహిళల వ్యక్తిగత స్ట్రోక్​ ప్లే రౌండ్​ 3లో రెండో స్థానంలో నిలిచిన అదితికి ఈ ఈవెంట్​లో రజతం సాధించే అవకాశముంది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో మూడో రౌండ్‌ ముగిసేసరికి అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

Updated Date - 2021-08-07T07:38:05+05:30 IST