ఎన్టీపీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్యాగ్రహ దీక్ష

ABN , First Publish Date - 2022-01-22T05:57:35+05:30 IST

రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే సత్యాగ్రహ దీక్ష చేస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ స్పష్టం చేశారు.

ఎన్టీపీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్యాగ్రహ దీక్ష
గేట్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

జ్యోతినగర్‌, జనవరి 21 : రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే సత్యాగ్రహ దీక్ష చేస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్టీపీసీ ప్లాంటు వద్ద  జరిగిన గేట్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగిస్తూ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారంలో ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎన్టీపీసీలో అన్ని సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పడి యాజ మాన్యంపై పోరాటం చేశాయని, మూడేళ్ల క్రితం జేఏసీతో ఒప్పందాన్ని కుదుర్చుకుం దన్నారు. ఒప్పందాన్ని అమలుచేయడంలో ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసింద ని విమర్శించారు. ఒప్పందంలోని అనేక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఈ విషయంలో ఇటీవల హైదరాబాద్‌లో సెంట్రల్‌ అసిస్టెంట్‌లేబర్‌ కమి షనర్‌తో సమావేశమై చర్చించానని తెలిపారు. ఈనెల చివరిలో లేదా వచ్చే నెలలో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనరే స్వయంగా రామగుండం ఎన్టీపీసీకి వచ్చి ఎన్టీపీసీ అధి కారులతో మాట్లాడుతానని లేబర్‌ కమిషనర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు సంస్థలో అప్రెంటిస్‌, ఉపాధి కల్పించేలా చూస్తానన్నారు. చిన్న అనారోగ్యం ఉన్నా కార్మికులను అన్‌ఫిట్‌ చేసేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం కుట్ర చేస్తోందని, గేట్‌ పాస్‌ ఆపే ప్రయత్నం చేస్తోందన్నారు. బీ కేటగిరి కింద కార్మికుల వేతనాలు పెంచే విషయంలలో ఎంపీ వెంకటేశ్‌ నేతతో కేంద్రంపై ఒత్తిడి తెస్తానని, తద్వారా కార్మికుల వేతనాలు పెరిగేలా చూస్తానన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేర కు రామగుండంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటా యించామని, త్వరలో రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డితో ఈఎస్‌ఐ ఆసుపత్రికి శంకుస్థాపన చేయిస్తానని తెలిపారు. రామగుండంలో ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్‌ త్వరలో ప్రారంభం చేస్తారన్నారు. కార్యక్రమంలో మేయర్‌ అనిల్‌ కుమార్‌, కార్పొరేట ర్లు రమణారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్‌, కృష్ణవేణి, పులేందర్‌, భాస్కర్‌, బాల రాజ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్యాల రామారావు, రామస్వామి, నారాయణదాస్‌, మారుతి, వేణు, శ్రీనివాస్‌, కుమ్మరి శారద, కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:57:35+05:30 IST