రైతును రాజును చేసేందుకు అద్భుత పథకాలు: సత్యవతి రాథోడ్‌

ABN , First Publish Date - 2021-08-13T01:12:44+05:30 IST

నిరంతరం అన్నదాతల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్‌ అద్భుతమైన పథకాలు అమలు

రైతును రాజును చేసేందుకు అద్భుత పథకాలు: సత్యవతి రాథోడ్‌

వరంగల్: నిరంతరం అన్నదాతల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్‌ అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి సత్యవతిరాథోడ్‌ కొనియాడారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు, 24 గంటల కరెంట్‌ ఇస్తున్న కేసీఆర్‌ లాంటి సీఎం దేశంలో మరెక్కడా లేరని ప్రశసించారు. స్వాతంత్ర్యానంతరం 75 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తైయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మరో ఎత్తు అని అన్నారు. ప్రతీ రంగంలో అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని సత్యవతి రాథోడ్‌ తెలిపారు.

Updated Date - 2021-08-13T01:12:44+05:30 IST