Abn logo
Sep 20 2021 @ 20:02PM

పోడు భూ సమస్య పరిష్కారానికి కృషి: సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌: రాష్ట్రంలో సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక త్వరలోనే ఇవ్వనుందని చెప్పారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అడవులు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్‌ జిల్లాతో పాటు ఆదిలాబాద్‌, ఖమ్మం, ములుగు జిల్లాల్లో పోడు సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. పోడు సమస్యలపై అవగాహాన ఉన్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, అజయ్‌కుమార్‌, జగదీశ్వర్‌రెడ్డిలను సభ్యులుగా గిరిజన సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న సీఎస్‌ సోమేష్ కుమార్‌తో కలిపి క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేశారన్నారు. ఈ కమిటీ ఇప్పటికే పోడు భూముల సమస్య పరిష్కారం కోసం తొలి సమావేశాన్ని నిర్వహించుకున్నారని చెప్పారు. మరో సమావేశం అసెంబ్లీ సెషన్‌ సమయంలో జరుగుతుందని ఆమె చెప్పారు. అనంతరం పోడు భూముల సమస్య పరిష్కారం కోసం క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక సమర్పిస్తుందని, తద్వారా పోడు సమస్య పరిష్కారం జరుగుతుందని ఆశాభావాన్ని సత్యవతిరాథోడ్‌ వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption