మక్కా మసీదులో ప్రార్థనలకు సౌదీ అనుమతి !

ABN , First Publish Date - 2020-10-19T12:24:29+05:30 IST

సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదివారం నుంచి దేశ పౌరులు, నివాసితులకు మక్కా మసీదులో(అల్ హరామ్ మసీదు) ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

మక్కా మసీదులో ప్రార్థనలకు సౌదీ అనుమతి !

రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదివారం నుంచి దేశ పౌరులు, నివాసితులకు మక్కా మసీదులో(అల్ హరామ్ మసీదు) ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఉమ్రా యాత్రతో పాటు ప్రార్థనలను నిలిపివేసిన సౌదీ ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ వీటిని ప్రారంభించింది. ఇక నుంచి రోజుకు 40వేల మందిని ప్రార్థనలు చేసుకోవడానికి, 15వేల ఉమ్రా యాత్రికులను మక్కా మసీదులో అనుమతిస్తామని సౌదీ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో సౌదీ తన పౌరులు, నివాసితులు పవిత్ర స్థలాలైన మక్కా, మదీనాలో ఉమ్రా తీర్థయాత్రకు అనుమతించిన విషయం తెలిసిందే. కాగా, ఇతర దేశాలకు చెందిన ముస్లింలకు నవంబర్ 1వ తేదీ నుంచి ఉమ్రా యాత్రకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది.

Updated Date - 2020-10-19T12:24:29+05:30 IST