విజిట్ వీసాల గ‌డువుపై సౌదీ కీల‌క నిర్ణ‌యం!

ABN , First Publish Date - 2021-06-13T15:46:30+05:30 IST

రోనా నేప‌థ్యంలో 20 దేశాల‌పై సౌదీ అరేబియా బ్యాన్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ దేశాలకు చెందిన సంద‌ర్శ‌కులు తీసుకున్న‌ విజిట్ వీసాల గ‌డువు ముగియ‌డంతో వారు ఇబ్బందులు ప‌డ‌డం గ‌మ‌నించిన‌ ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వారి విజిట్ వీసాల గ‌డువును పొడిగించింది.

విజిట్ వీసాల గ‌డువుపై సౌదీ కీల‌క నిర్ణ‌యం!

రియాధ్‌: క‌రోనా నేప‌థ్యంలో 20 దేశాల‌పై సౌదీ అరేబియా బ్యాన్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ దేశాలకు చెందిన సంద‌ర్శ‌కులు తీసుకున్న‌ విజిట్ వీసాల గ‌డువు ముగియ‌డంతో వారు ఇబ్బందులు ప‌డ‌డం గ‌మ‌నించిన‌ ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వారి విజిట్ వీసాల గ‌డువును పొడిగించింది. ఉప‌యోగించ‌ని విజిట్‌ వీసాల గ‌డువును జూలై 31 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించింది. దీనికి వీసాదారులు ఎలాంటి అద‌న‌పు రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఎల‌క్ట్రానిక్ స‌ర్వీస్ ద్వారా ఆటోమెటిక్‌గా గ‌డువు పొడిగింపు వ‌ర్తింప‌జేయ‌నున్న‌ట్లు విదేశాంగ శాఖ తెలియ‌జేసింది. మ‌హ‌మ్మారి కార‌ణంగా సౌదీలో తీవ్రంగా దెబ్బ‌తిన్న ప‌ర్యాట‌క రంగాన్ని ఆదుకునేందుకు ఆ దేశ‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ క‌లిసి ప్ర‌త్యేక ప్ర‌ణాళికల‌ను సిద్ధం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే  సౌదీ అరేబియా తాజాగా విజిట్ వీసాల గ‌డువును పెంచింది.     

Updated Date - 2021-06-13T15:46:30+05:30 IST