ఉమ్రా పర్మిట్ల జారీ విషయమై Saudi Arabia కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-01-18T18:50:34+05:30 IST

ఉమ్రా పర్మిట్ల జారీ విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక ప్రకటన చేసింది.

ఉమ్రా పర్మిట్ల జారీ విషయమై Saudi Arabia కీలక ప్రకటన

రియాద్: ఉమ్రా పర్మిట్ల జారీ విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక ప్రకటన చేసింది. విదేశీ యాత్రికులతో సహా అన్ని వయసుల యాత్రికులకు రెండు ఉమ్రా పర్మిట్‌ల జారీకి మధ్య 10 రోజుల విరామం తప్పనిసరి చేసింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ తాజాగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. కింగ్‌డమ్‌కు వచ్చే విదేశీ యాత్రికులు తమ 30 రోజుల పర్మిట్‌‌‌లో గరిష్టంగా మూడు ఉమ్రాలను చేసుకోవచ్చని మంత్రిత్వశాఖ పేర్కొంది. పర్మిట్ పొందిన యాత్రికుడు మొదటి ఉమ్రా చేసిన 10 రోజుల తర్వాత ఈట్‌మార్నా లేదా తవక్కల్నా యాప్ ద్వారా రెండో ఉమ్రా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే తవక్కల్నాలో సంపూర్ణ ఆరోగ్య స్థితి కేటగిరీలో ఉన్న 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న యాత్రికులందరూ గ్రాండ్ మసీదులో ఉమ్రా, ప్రార్థన చేసుకునే వెసులుబాటు ఉందని తెలియజేసింది. ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు, నివారణ ప్రోటోకాల్‌లో భాగంగా పది రోజుల పరిమితిని విధించినట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.       

Updated Date - 2022-01-18T18:50:34+05:30 IST