విదేశీ యాత్రికులకు సౌదీ కొత్త నిబంధనలివే..

ABN , First Publish Date - 2021-04-17T13:21:09+05:30 IST

ఉమ్రా, హజ్ యాత్రకు వచ్చే విదేశీయులకు కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా సర్కార్ కొత్త నిబంధనలు విధించింది.

విదేశీ యాత్రికులకు సౌదీ కొత్త నిబంధనలివే..

రియాద్: ఉమ్రా, హజ్ యాత్రకు వచ్చే విదేశీయులకు కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా సర్కార్ కొత్త నిబంధనలు విధించింది. ఈ మేరకు ఉమ్రా నిర్వహించడానికి కింగ్‌డమ్ వెలుపల నుండి వచ్చే యాత్రికులకు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ఐదు నిబంధనలను ప్రకటించింది. ఉమ్రా కోసం వచ్చే విదేశీ యాత్రికులు మక్కాలోని ఇనాయా కేంద్రానికి ఆరు గంటల ముందే చేరుకోవాలి. వ్యాక్సినేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఇచ్చే డిజిటల్ రిస్ట్‌బ్యాండ్‌లు ధరించాలి. అనంతరం అల్ షుబైకా అసెంబ్లీ సెంటర్‌కు చేరుకున్న తర్వాత వాటిని అక్కడ చూపించాల్సి ఉంటుంది. అంతేగాక ఉమ్రా కోసం యాత్రికులకు కేటాయించిన తేదీ, సమయాలను కచ్చితంగా పాటించాలి. అలాగే విదేశీ యాత్రికులు సౌదీ చేరుకున్న తర్వాత మక్కాలో వారు బసచేసే హోటళ్లలో తప్పకుండా మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి.     

Updated Date - 2021-04-17T13:21:09+05:30 IST