సౌదీలో యువ‌త‌కు 15 నెల‌ల పాటు నిరుద్యోగ‌భృతి

ABN , First Publish Date - 2021-05-17T03:07:38+05:30 IST

సౌదీ అరేబియా ఆ దేశంలోని నిరుద్యోగుల విష‌య‌మై తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

సౌదీలో యువ‌త‌కు 15 నెల‌ల పాటు నిరుద్యోగ‌భృతి

రియాద్: సౌదీ అరేబియా ఆ దేశంలోని నిరుద్యోగుల విష‌య‌మై తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోని యువ‌త‌కు చేదోడుగా నిరుద్యోగ‌భృతి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఆ దేశ మంత్రి మండ‌లి నిర్ణ‌యం మేర‌కు అర్హులైన వారికి 15 నెల‌ల ఆర్థిక‌సాయం అందనుంది. కాగా, నిరుద్యోగ‌భృతి సహాయాన్ని నాలుగు విభాగాలు విభ‌జించింది. ల‌బ్ధిదారుల‌కు తొలి నాలుగు నెల‌లు 2వేల సౌదీ రియాల్‌(రూ.39వేలు), ఆ త‌ర్వాతి నాలుగు నెల‌లు 1500 సౌదీ రియాల్‌(రూ.29,308), మ‌రో నాలుగు నెల‌లు 1000 సౌదీ రియాల్(రూ.19,539), చివ‌ర‌గా మూడు నెల‌లు 750 సౌదీ రియాల్‌(రూ.14,654) చొప్పున నిరుద్యోగ‌భృతి అందిస్తారు. 20 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు గ‌ల యువ‌తి, యువ‌కులు ఈ ఆర్థిక సాయానికి అర్హులు. అలాగే సౌదీ పౌరులు, శాశ్వ‌త నివాసితులకు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది.   

Updated Date - 2021-05-17T03:07:38+05:30 IST