ప్రపంచంలోనే తొలి Flying Museum ను ప్రారంభిస్తున్న Saudi

ABN , First Publish Date - 2021-11-03T14:01:56+05:30 IST

గల్ఫ్ దేశం సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ మ్యూజియాన్ని ప్రారంభిస్తోంది. గురువారం ఈ చారిత్రాత్మక ఘట్టం అవిష్కృతం కానుంది.

ప్రపంచంలోనే తొలి Flying Museum ను ప్రారంభిస్తున్న Saudi

రియాద్: గల్ఫ్ దేశం సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ మ్యూజియాన్ని ప్రారంభిస్తోంది. గురువారం ఈ చారిత్రాత్మక ఘట్టం అవిష్కృతం కానుంది. దీని ద్వారా రాజధాని రియాద్ నుంచి చారిత్రక అలూలా నగరం వరకు విమాన ప్రయాణం ద్వారా చారిత్రక అందాల్ని వీక్షించే అవకాశం ఏర్పడుతుంది. రాయల్ కమిషన్ ఫర్ అలూలా, నేషనల్ ఫ్లాగ్ క్యారియర్ సౌదియా ఈ అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అలూలా కోసం రాయల్ కమీషన్, నేషనల్ ఫ్లాగ్ క్యారియర్ సౌదియా మధ్య సహకార ప్రాజెక్ట్ అయిన ఈ మ్యూజియం పురావస్తు త్రవ్వకాల ద్వారా అలూలాలో కనుగొనబడిన కళాఖండాల ప్రతిరూప సేకరణలను కూడా ప్రదర్శిస్తుంది. 


అలాగే ఈ సంవత్సరం విడుదలైన “ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ అరేబియా” అనే డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీని కూడా ప్రయాణికులు చూడొచ్చని సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక కమీషన్‌లోని పురావస్తు, సాంస్కృతిక వారసత్వ పరిశోధన డైరెక్టర్ రెబెక్కా ఫూట్ ఈ పర్యటనలో డాక్యుమెంటరీకి పరిచయంతో పాటు మ్యూజియంలో ఉన్న కళాఖండాల గురించి వివరించనున్నారు. 

Updated Date - 2021-11-03T14:01:56+05:30 IST