సౌదీలో ఒకేరోజు రికార్డుస్థాయి రిక‌వ‌రీలు !

ABN , First Publish Date - 2020-07-08T17:50:35+05:30 IST

సౌదీ అరేబియాలో పంజా విసురుతున్న మ‌హ‌మ్మారి కోవిడ్‌-19 వ‌ల్ల ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కొత్త‌ కేసులు న‌మోద‌వుతున్నాయి.

సౌదీలో ఒకేరోజు రికార్డుస్థాయి రిక‌వ‌రీలు !

రియాద్‌: సౌదీ అరేబియాలో పంజా విసురుతున్న మ‌హ‌మ్మారి కోవిడ్‌-19 వ‌ల్ల ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కొత్త‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే, మంగ‌ళ‌వారం కొత్త కేసుల కంటే రిక‌వ‌రీలు ఎక్కువ‌గా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. నిన్న ఒక్క‌రోజే సౌదీలో 5,205 రిక‌వ‌రీలు న‌మోదైతే... 3,392 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ‌ ‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు సౌదీలో క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య 2,17,108కు చేరితే... 1,54,839 మంది కోలుకున్నార‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు తెలియ‌జేశారు. ఇక మంగ‌ళ‌వారం సంభ‌వించిన 49 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు సౌదీలో 2,017 మంది ఈ వైర‌స్‌కు బ‌ల‌య్యారు. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 5.45 ల‌క్ష‌ల‌ మందిని పొట్ట‌నుబెట్టుకుంది. కోటి 19 ల‌క్ష‌ల‌ మంది క‌రోనా బాధితులు ఉన్నారు.  


Updated Date - 2020-07-08T17:50:35+05:30 IST