సౌదీలో త‌గ్గుతున్న‌ కోవిడ్ ప్ర‌భావం..!

ABN , First Publish Date - 2020-08-04T20:06:58+05:30 IST

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుతోంది.

సౌదీలో త‌గ్గుతున్న‌ కోవిడ్ ప్ర‌భావం..!

రియాద్: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుతోంది. క్ర‌మంగా సౌదీ కోవిడ్ నుంచి కోలుకుంటోంది. పాజిటివ్ కేసులు త‌గ్గి... రిక‌వరీలు పెరుగుతున్నాయి. సోమ‌వారం దేశ‌వ్యాప్తంగా 1,258 కొత్త కేసులు నమోదు కాగా... 1,972 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ బారిన ప‌డ్డ వారు 280,093 మంది అయితే... మొత్తం రివ‌క‌రీలు 242,053 అయ్యాయి. కాగా, నిన్న సంభ‌వించిన 32 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు సౌదీ వ్యాప్తంగా 2,949 మంది క‌రోనాకు బ‌ల‌య్యార‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో 35,091 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 2,017 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న ఈ వైర‌స్ ఇప్ప‌టికే 6.97 ల‌క్ష‌ల మందిని క‌బ‌ళించింది. అలాగే కోటి 84 ల‌క్ష‌ల మందికి సోకింది.   

Updated Date - 2020-08-04T20:06:58+05:30 IST