సౌదీ కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2021-05-17T17:01:28+05:30 IST

సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మే 17 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇస్తున్నట్టు

సౌదీ కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్

రియాద్: సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మే 17 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇస్తున్నట్టు సౌదీ అరేబియా వెల్లడించింది. వ్యాక్సిన్ పొందిన ప్రయాణికులు సౌదీ అరేబియాకు వచ్చిన తర్వాత కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేకాకుండా సదరు ప్రయాణికులకు క్వారెంటైన్ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది. అంతేకాకుండా సౌదీలోని 9 ఎయిర్‌పోర్ట్‌ల నుంచి సోమవారం రోజు పలు ప్రాంతాలకు 385 విమానాలు బయల్దేరతాయని తెలిపింది. అయితే బ్యాన్ విధించిన దేశాల పౌరులను ఎట్టి పరిస్థితుల్లో తమ దేశంలోకి అనుమతించబోమని సౌదీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియా బ్యాన్ విధించిన 13 దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్న విషయం తెలిసిందే.


Updated Date - 2021-05-17T17:01:28+05:30 IST