సౌదీ కీలక నిర్ణయం.. భారతీయులకు నో ఎంట్రీ!

ABN , First Publish Date - 2020-09-23T22:32:16+05:30 IST

భారత్‌లో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీ

సౌదీ కీలక నిర్ణయం.. భారతీయులకు నో ఎంట్రీ!

రియాద్: భారత్‌లో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా బ్రెజిల్, అర్జెంటీనా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ మేరకు ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియా, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల నుంచి వచ్చే విమానాలను సస్పెండ్ చేస్తున్నట్లు అందులో పేర్కొంది. సౌదీ నుంచి కూడా భారత్, బ్రెజిల్, అర్జెంటీనా దేశాలకు ఎటువంటి విమాన సర్వీసులు ఉండవని స్పష్టం చేసింది. సౌదీకి రావడానికి 14 రోజుల ముందు.. ఏ ప్రయాణికుడైనా ఈ దేశాల్లో పర్యటించినట్లు ట్రావెల్ హిస్టరీ ఉంటే.. సదరు ప్రయాణికుడ్ని తమ దేశంలోకి అనుమతించమని తేల్చి చెప్పింది. భారత్, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కాగా.. సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు 3.30లక్షల మంది కరోనా బారినపడగా..4,542 మంది మృత్యువాతపడ్డారు. 


Updated Date - 2020-09-23T22:32:16+05:30 IST