హజ్ యాత్రపై సౌదీ అరేబియా కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-06-13T01:10:41+05:30 IST

హజ్ యాత్ర‌పై సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. గత సంవత్సరం అవలంభించిన విధానాన్నే ఈ ఏడాది కూడా అనుసరించనున్నట్టు తెలిపింది. ఇతర దేశాల నుంచి వచ్చే యాత్రికులకు అనుమతి ని

హజ్ యాత్రపై సౌదీ అరేబియా కీలక ప్రకటన!

రియాద్: హజ్ యాత్ర‌పై సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. గత సంవత్సరం అవలంభించిన విధానాన్నే ఈ ఏడాది కూడా అనుసరించనున్నట్టు తెలిపింది. ఇతర దేశాల నుంచి వచ్చే యాత్రికులకు అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది హజ్ యాత్రకు కేవలం 60వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో 65ఏళ్లలోపు వయసు కలిగి.. వ్యాక్సిన్ తీసుకున్న సౌదీ పౌరులు, నివాసితులకు మాత్రమే ఈ ఏడాది అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. సౌదీ అరేబియా గత ఏడాది కూడా ఇతర దేశాల యాత్రికులకు అనుమతి ఇవ్వలేదు. కేవలం ఆ దేశంలోని 10వేల మందికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి ఇచ్చింది. కాగా.. 2019లో 2.5 మిలియన్ల మంది ఇందులో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం సిద్ధం అయిన భారత ముస్లింలకు సౌదీ ప్రకటన నిరాశే మిగిల్చింది.


Updated Date - 2021-06-13T01:10:41+05:30 IST