Sports మైదానాల్లో ప్రేక్షకుల అనుమతిపై Saudi కీలక నిర్ణయం.. ఇకపై అభిమానులకు..

ABN , First Publish Date - 2021-10-17T18:45:09+05:30 IST

సౌదీ అరేబియా స్పోర్ట్స్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇకపై అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లకు మైదానాల్లో పూర్తి సామర్థ్యంలో అభిమానులను అనుమతి ఇవ్వనున్నట్లు ఆ దేశ క్రీడా మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది.

Sports మైదానాల్లో ప్రేక్షకుల అనుమతిపై Saudi కీలక నిర్ణయం.. ఇకపై అభిమానులకు..

రియాద్: సౌదీ అరేబియా స్పోర్ట్స్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇకపై అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లకు మైదానాల్లో పూర్తి సామర్థ్యంలో అభిమానులను అనుమతి ఇవ్వనున్నట్లు ఆ దేశ క్రీడా మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. అయితే, వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు మాత్రమే మైదానాలకు వెళ్లేందుకు అర్హులని పేర్కొంది. కింగ్‌డమ్ ఆమోదించిన కరోనా టీకాలను రెండు డోసులు వేసుకున్నవారు ఎలాంటి అభ్యంతరం లేకుండా స్పోర్ట్స్ ఈవెంట్లకు హాజరు కావొచ్చని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఆదివారం నుంచి ఇలా పూర్తి కెపాసిటీతో మైదానాలకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపింది.


అటు శుక్రవారం సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ కూడా ఓ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే వ్యాక్సినేషన్ కూడా విరివిగా జరుగుతుండడం ఆంక్షల తొలగింపునకు ఒక కారణంగా మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు సామాజిక దూరం, ముఖానికి మాస్కు ధరించడం వంటి కరోనా నిబంధనలు పాటించడం మంచిదని తెలిపింది.        

Updated Date - 2021-10-17T18:45:09+05:30 IST