Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్ సహా 6 దేశాల ప్రయాణికులకు Saudi Arabia గుడ్‌న్యూస్

జెడ్డా: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ఏడాదిన్నరకు పైగా అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన ఆంక్షలను ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాయి. వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతుండడంతో ఆంక్షలను తొలగించే పనిలో ఉన్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు విదేశీ ప్రయాణికులపై ఉన్న నిషేధాన్ని తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో సౌదీ అరేబియా చేరింది. భారత్ సహా ఆరు దేశాలపై ఉన్న డైరెక్ట్ ఎంట్రీ నిషేధాన్ని తాజాగా ఎత్తి వేసింది. 

దీంతో భారత్, పాకిస్థాన్, బ్రెజిల్, వియత్నం, ఈజిప్ట్, ఇండోనేషియా దేశాల పౌరులు ఇప్పుడు నేరుగా సౌదీకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ఈ ఆరు దేశాల పౌరులు సౌదీ వెళ్లొచ్చు. అయితే, అక్కడికెళ్లిన తర్వాత ఐదు రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి. ఈ మేరకు గురువారం సౌదీ అధికారులు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 1వ తేదీన తెల్లవారుజాము ఒంటి గంట నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అలాగే సౌదీ వెళ్లిన తర్వాత అక్కడి ఆరోగ్యశాఖ సూచన మేరకు కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ల నేపథ్యంలో సౌదీ సుమారు 20 దేశాల ప్రయాణికులు నేరుగా తమ దేశానికి రాకుండా నిషేధం విధించిన విషయ తెలిసిందే. ఈ జాబితాలో భారత్‌తో పాటు యూఏఈ, ఈజిప్ట్, లెబనాన్, టర్కీ, ఐర్లాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, స్వీడన్, బ్రెజిల్, అర్జెంటీనా, యూఎస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, పాకిస్థాన్, జపాన్ ఉన్నాయి. అలాగే ఈ 20 దేశాల గుండా ప్రయాణించి వచ్చే ప్రయాణికులు సౌదీలో నేరుగా ప్రవేశించకుండా.. కింగ్‌డమ్ బయట 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన కూడా విధించింది. అయితే, ఈ దేశాలకు చెందిన దౌత్యాధికారులు, మెడికల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement