ప్ర‌వాసుల‌కు సౌదీ తీపి కబురు!

ABN , First Publish Date - 2021-06-10T14:12:56+05:30 IST

ప్ర‌వాసుల‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం తీపి క‌బురు అందించింది. మ‌హ‌మ్మారి క‌రోనా కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్ర‌వాసుల రెసిడెన్సీ ప‌ర్మిట్(ఇఖామా) గ‌డువును జూలై 31 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ద జ‌న‌ర‌ల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ ఈన్ సౌదీ అరేబియా తాజాగా వెల్ల‌డించింది.

ప్ర‌వాసుల‌కు సౌదీ తీపి కబురు!

ప్ర‌వాసుల రెసిడెన్సీ ప‌ర్మిట్‌, వీసాల‌ గ‌డువు జూలై 31 వ‌ర‌కు పొడిగింపు

రియాద్: ప్ర‌వాసుల‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం తీపి క‌బురు అందించింది. మ‌హ‌మ్మారి క‌రోనా కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్ర‌వాసుల రెసిడెన్సీ ప‌ర్మిట్(ఇఖామా) గ‌డువును జూలై 31 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ద జ‌న‌ర‌ల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ ఇన్ సౌదీ అరేబియా తాజాగా వెల్ల‌డించింది. ఇది విజిట్ వీసా, ఎగ్జిట్ మ‌రియు రీఎంట్రీ వీసాల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. దీనికి ప్ర‌వాసులు ఎలాంటి అద‌న‌పు రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే ప్ర‌వాసులు త‌మ రెసిడెన్సీ ప‌ర్మిట్లు, విజిట్ వీసాలు, ఎగ్జిట్ మ‌రియు రీఎంట్రీ వీసాల‌ను రెన్యూవ‌ల్ చేసుకోకుండానే ఆటోమెటిక్‌గా వాటికి ఈ పొడిగింపు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్ స‌హ‌కారంతో వాటి గ‌డువు ఆటోమెటిక్‌గా అప్‌డేట్ చేస్తున్న‌ట్లు పాస్‌పోర్ట్స్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ అధికారులు వెల్ల‌డించారు. ఇక ఈ పొడిగింపు అనేది ఫిబ్ర‌వ‌రి 2న క‌రోనా నేప‌థ్యంలో సౌదీ నిషేధం విధించిన‌ 20 దేశాల ప్ర‌వాసుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.     

Updated Date - 2021-06-10T14:12:56+05:30 IST