Abn logo
Sep 19 2021 @ 11:39AM

సౌదీ విదేశాంగ మంత్రి మూడు రోజుల భారత పర్యటన: అఫ్ఘానిస్తాన్ అంశంపై చర్చలు!

న్యూఢిల్లీ: సౌదీ విదేశాంగశాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించాక అక్కడ పెరిగిపోతున్న అరాచకాలు తదితర అంశాలపై సౌదీ మంత్రి  భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌లతో చర్చించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ట్వీట్‌లో తెలియజేశారు. సౌదీ మంత్రి ఇప్పటికీ ఢిల్లీ చేరుకున్నారని తెలిపారు. 


ఇవి కూడా చదవండిImage Caption