సౌదీ రైల్వేస్‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ సెఫ్టీ అవార్డ్ 2020

ABN , First Publish Date - 2020-08-15T15:14:28+05:30 IST

సౌదీ అరేబియా రైల్వేస్‌ కంపెనీ(ఎస్ఏఆర్‌) 2020 ఏడాదికి గాను ఇంట‌ర్నేష‌న‌ల్ సెఫ్టీ అవార్డ్ గెలుచుకుంది.

సౌదీ రైల్వేస్‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ సెఫ్టీ అవార్డ్ 2020

రియాద్: సౌదీ అరేబియా రైల్వేస్‌ కంపెనీ(ఎస్ఏఆర్‌) 2020 ఏడాదికి గాను ఇంట‌ర్నేష‌న‌ల్ సెఫ్టీ అవార్డ్ గెలుచుకుంది. బ్రిటీష్ సెఫ్టీ కౌన్సిల్ అందించే ఈ పుర‌స్కారాన్ని సౌదీ రైల్వేస్ వ‌రుస‌గా రెండో ఏడాది గెలుచుకోవ‌డం విశేషం. అత్యున్న‌తస్థాయి సెఫ్టీ స్టాండ‌ర్డ్స్‌ను పాటించ‌డం వ‌ల్లే తాము ఈ  అవార్డు ‌‌ గెలుచుకున్నామ‌ని ఎస్ఏఆర్ చీఫ్ బ‌షార్ బిన్ ఖ‌లీద్ అల్ మాలిక్ అన్నారు. ఈ పుర‌స్కారం గెలుచుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్న ఆయ‌న‌... మేనేజ్‌మెంట్, మెయింటెనెన్స్ త‌దిత‌ర విభాగాల్లో తాము స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.  


Updated Date - 2020-08-15T15:14:28+05:30 IST