డ్రోన్‌ దాడులకు సౌదీ ప్రతీకారం

ABN , First Publish Date - 2022-01-19T13:15:17+05:30 IST

యూఏఈ రాజధాని అబుధాబిలోని జాతీయ చమురు కంపెనీ (ఏడీఎన్‌వోసీ)ని లక్ష్యగా చేసుకొని సోమవారం జరిగిన తీవ్రమైన డ్రోన్‌ దాడికి సౌదీ అరేబియా ప్రతీకారం తీర్చుకుంది.

డ్రోన్‌ దాడులకు సౌదీ ప్రతీకారం

దుబాయ్‌: యూఏఈ రాజధాని అబుధాబిలోని జాతీయ చమురు కంపెనీ (ఏడీఎన్‌వోసీ)ని లక్ష్యగా చేసుకొని సోమవారం జరిగిన తీవ్రమైన డ్రోన్‌ దాడికి సౌదీ అరేబియా ప్రతీకారం తీర్చుకుంది. దాడికి పాల్పడినట్లుగా ప్రకటించుకున్న యెమెన్‌లోని అతిపెద్ద  నగరమైన సనాలోని ఓ భవనంపై సౌదీ అరేబియా దాడి చేసింది. ఈ ఘటనలో భవనంలోని 14 మంది మృతిచెందారు. కాగా ఏడీఎన్‌వోసీపై దాడి తర్వాత అబుధాబి చమురు కార్పొరేషన్‌ మీదుగా దట్టమైన పొగ అలుముకున్నట్లుగా శాటిలైట్‌ చిత్రాల్లో ఉంది. డ్రోన్‌ దాడిలో మృతిచెందిన ఇద్దరు భారతీయులను గుర్తించినట్లు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని, మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు యూఏఈ ప్రభుత్వం ఏడీఎన్‌వోసీ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. 

Updated Date - 2022-01-19T13:15:17+05:30 IST