ఆ 12 దేశాలకు వెళ్లే వారికి సౌదీ వార్నింగ్ !

ABN , First Publish Date - 2021-01-15T16:44:41+05:30 IST

మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో 12 దేశాలకు వెళ్లే దేశ పౌరులు, నివాసితులకు తాజాగా సౌదీ అరేబియా వార్నింగ్ ఇచ్చింది.

ఆ 12 దేశాలకు వెళ్లే వారికి సౌదీ వార్నింగ్ !

రియాద్: మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో 12 దేశాలకు వెళ్లే దేశ పౌరులు, నివాసితులకు తాజాగా సౌదీ అరేబియా వార్నింగ్ ఇచ్చింది. ప్రధానంగా కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సౌదీ విడుదల చేసిన 12 దేశాల జాబితాలో సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, ఆఫ్గనిస్థాన్, లిబియా, వెనెజులా, బెలారస్, అర్మెనియా, సోమాలియా, కాంగో ఉన్నాయి. ఈ 12 దేశాలకు ప్రయాణించాలంటే ఇకపై ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. సౌదీలో స్వైర విహారం చేస్తున్న మహమ్మారి ఇప్పటి వరకు 3.60లక్షల మందికి ప్రబలింది. ఇందులో 6,310 మందిని కబళించింది.    


Updated Date - 2021-01-15T16:44:41+05:30 IST