Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లైన రెండు రోజులకే భర్తతో కాపురం చేయలేనంటూ కోర్టు మెట్లెక్కిన భార్య.. అసలు కారణమెంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రియాద్: సౌదీ అరేబియాలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహమై పట్టుమని రెండు రోజులు కూడా గడవకముందే నవవధువు భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంత చెప్పిన వినడం లేదు. తాను తల ఎత్తుకుని బతకాలంటే ఇప్పుడీ కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని కరాఖండిగా చెబుతోంది. సాధ్యమైనంత త్వరగా తనకు భర్త నుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా న్యాయస్థానాన్ని మొరపెట్టుకుంటోంది. ఇలా నవవధువు పెళ్లైన రెండు రోజులకే భర్త నుంచి విడాకులు కోరడానికి కారణం ఏంటి? తొలిరేయి నాడు భర్తకు సంబంధించి ఆమెకు తెలిసిన షాకింగ్ విషయమేమి? దాని కారణంగానే ఆమె విడాకుల కోసం కోర్టుకెక్కిందా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే విషయాలు తెలియాలంటే మనం ఈ స్టోరీ చదవాల్సిందే.

సౌదీలో ఉండే ఓ యువతికి బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అరబ్ వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అనంతరం కొన్ని రోజులకు వారి వివాహమైంది. ఆ సమయంలో వరుడు వారి సంప్రదాయం ప్రకారం వస్త్రాధారణతో రావడం వల్ల అతని సంబంధించిన ఓ లోపం పెళ్లి కూతురు తరపు వారికి తెలియలేదు. తలపై తెల్లటి వస్త్రంతో(ఘుత్రా) వచ్చిన వరుడు తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచి పెట్టాడు. ఇక పెళ్లైన మరుసటిరోజే వారికి ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వరుడు తలపై ఎలాంటి వస్త్రం లేకుండా బెడ్‌రూంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు. తలంతా నున్నగా మెరుస్తోంది. అంతే.. అతడిని అలా చూసిన నవవధువు వెంటనే బెడ్‌రూం నుంచి బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులను అసలేం జరిగిందని ప్రశ్నించిన ఏమీ చెప్పలేదు. చాలా సేపటి తర్వాత అసలు విషయం చెప్పింది. పెళ్లికొడుకు బట్టతల ఉన్న విషయం దాచిపెట్టి మోసం చేశాడని, తనకు వెంటనే విడాకులు కావాలని బోరున విలపించింది. 

దాంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎంతో బ్రతిమాలి చూశారు. చివరికి కౌన్సిలింగ్ సెంటర్‌కు సైతం తీసుకెళ్లిన ఆమెలో మార్పు రాలేదు. చివరకు తనకు విడాకులు కావాల్సిందేనని తాజాగా సౌదీ ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కింది. ఇంత చిన్న విషయానికి విడాకులేంటని న్యాయస్థానం కూడా యువతిని ప్రశ్నించింది. తాను భవిష్యత్‌లో తలెత్తుకుని బతకాలంటే ఇప్పుడు తాను తీసుకుంటున్న ఈ నిర్ణయమే సరైందని ఆమె పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా తనకు విడాకులు మంజూరు చేయాలని కోరింది. కాగా, ప్రస్తుతం దంపతులిద్దరికీ విడాకుల విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని కోర్టు కొంత సమయం ఇచ్చింది. కానీ, యువతి మాత్రం తనకు విడాకులు కావాల్సిందేనని పట్టుబడుతోంది.    

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement