సేవ్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి...

ABN , First Publish Date - 2021-08-09T22:11:59+05:30 IST

జంగారెడ్డిగూడెం: నాటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో.. ప్రస్తుతం సేవ్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు.

సేవ్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి...

జంగారెడ్డిగూడెం: నాటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో.. ప్రస్తుతం సేవ్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య, వామపక్ష, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ, కాంగ్రెస్ ఏలూరు జిల్లా కమిటీ, రైతు, కార్మిక సంఘాలు, సీపీఐ, సీపీఎం, సీపీఎంఎల్, సీఐటీయూ, ఇఫ్టు, ఐకాస్, అంగన్వాడీ వర్కర్స్, ఆటో యూనియన్, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 


కార్యక్రమానికి సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అధ్యక్షుడు రమణ అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ ఏలూరు పార్లమెంట్ జిల్లా  కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ ఏపీ అధ్యక్షుడు జెట్టి గురునాథ్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గురునాథ్ రావు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నాడు బ్రిటిష్ పాలకులను దేశం నుంచి తరిమి కొట్టారని.. నేడు అదే స్ఫూర్తితో మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టే సమయం ఆసన్నమైందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని అనేక రంగాల్లో ముందుకు నడిపించి, భారత సంపదని పెంపొందిస్తే.. నేడు మోదీ ఏడేళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. రైతులు, కార్మికులు, అధికారులకు వ్యతిరేకమైన చట్టాలు చేస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్పొరేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని.. అందుకే అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు కలిసి సేవ్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాయని గుర్తు చేశారు.

 

కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రమణ, ఏసుబాబు, సీపీఐ ఎంఎల్ పార్టీ జీవరత్నం, సుభాషిణి, మాణిక్యాలరావు, చందర్రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు శీలంరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నులకాని నాగబాబు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఏలూరు పని కుమార్, వీరవల్లి సోమేశ్వరరావు, తాడేపల్లి ఉమాదేవి, మొగలినీడి శ్యామ్, అట్లూరి శ్రీనివాస్, రామరాజు, బొరుసు ప్రసాదు, ప్రగల్ల పాటి కాశి, మెగా టైలర్ రామారావు, ప్రగడ ప్రభు, కొల్లి రామ సూర్య రెడ్డి, సతీష్, పిండి రాము, మామిడి రాము తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-09T22:11:59+05:30 IST