Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా పసిప్రాణాన్ని కాపాడేది మీ సాయమే...

సుమారు ఏడాది కిందట అభిమన్యు పుట్టినప్పుడు మేమంతా ఎంతో ఆనందపడ్డాం. మాకు సంతానం కలగాలనే ఆశ తప్ప నేను, నా భర్త ఈ లోకంలో మరేదీ కోరలేదు.


మేం అమ్మానాన్నలం కాబోతున్నామని తెలిసినప్పుడు ఎంతో సంతోషించాం. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు.


ఒక రోజున అభిమన్యు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ చాలా భారంగా ఊపిరి తీసుకుంటున్నాడు. వాడి శరీరం నీలం రంగులోకి మారుతోంది. ఆ రోజు మార్చి 22, 2021. వెంటనే బాబును ఆస్పత్రికి తీసుకెళ్ళాం.


ఆ రోజున నేను మరింత భయానకమైన వార్త వినాల్సి వచ్చింది. "మీ అబ్బాయికి పుట్టుకతోనే గుండె జబ్బు ఉంది. ఈ సమస్యను సరిచేయవచ్చు కానీ, చికిత్స వెంటనే ప్రారంభించాలి" అని డాక్టర్లు చెప్పారు.


ఉదార హృదయంతో స్పందించి సాయం అందించండి.

మా అబ్బాయికి ఉన్న సమస్యను "Tetralogy of Fallot with severe infundibular and valvar pulmonary stenosis" అని తెలిసింది. దీన్ని నయం చెయ్యాలంటే వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి, నిరంతరాయంగా చికిత్స అందించాలి. ఇందుకయ్యే ఖర్చు సుమారు రూ.10 లక్షలు ($ 13692.34) అని తెలియజేశారు. ఇంత ఖర్చు మేం భరించలేం.


ఒక్కసారిగా నా ప్రపంచమంతా తల్లకిందులైంది.


మా స్వంత ఊరు తమిళనాడులోని ట్యూటికారన్. మా కుటుంబంలో నా భర్త ఒక్కడే కూలి పనులు చేస్తూ సంపాదిస్తాడు. ఇప్పుడు కరోనా పరిస్థితులు కావడంతో డబ్బు సర్దుబాటు చేసుకోవడం మరింత కష్టంగా మారింది.


మేం ఇప్పటికే అభిమన్యు చికిత్స కోసం పెద్ద మొత్తం ఖర్చు పెట్టాం. నా నగలు తనఖా పెట్టి ఎక్కువ వడ్డీకి పెద్ద మొత్తంలో అప్పు చేశాను. మాకున్నదంతా అయిపోయింది.


నా పసిపాపడు అలా బాధపడుతుంటే నాకు ఏడుపు ఆగడం లేదు. ఏది ఏమైనప్పటికీ నా కొడుకును కాపాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.


మా అబ్బాయి ఇంత బాధపడతాడని... వాడిని కాపాడుకోలేని ఇలాంటి ఒక దుర్భర పరిస్థితిని మా జీవితాల్లో కలలోనైనా ఊహించలేదు.


"మా అబ్బాయిని పోగొట్టుకోలేను.... ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు మమ్మల్ని గట్టెక్కించి కాపాడగలిగేది కేవలం మీరు మాత్రమే..."


ఉదార హృదయంతో స్పందించి సాయం అందించండి.

మీరెలా సాయం చెయ్యవచ్చంటే.....


వేదనలో మునిగిపోయిన ఈ తల్లిదండ్రులకు మిగిలిన ఆశ మీరు మాత్రమే. మీ దయార్ద్ర హృదయం మాత్రమే వారిని కాపాడగలుగుతుంది.


చిన్నారి అభిమన్యు అమ్మానాన్నా మీ సాయం కోరుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఆదిపరాశక్తి, మునియాసామి దంపతుల కుమారుడి చికిత్సకు ఇప్పుడు ఆర్ధిక సహాయం ఎంతో ముఖ్యం. ఉదార హృదయంతో స్పందించి సాయం అందించండి.

Advertisement
Advertisement

జాతీయం మరిన్ని...

చిత్రజ్యోతి మరిన్ని...