చెరువులు ఆక్రమణ కాకుండా చూడండి

ABN , First Publish Date - 2021-10-19T04:22:18+05:30 IST

మండలంలో అనేక చెరువులు ఆక్రమణకు గురవుతున్నందున ఆ సమస్యపై అధికారులు దృష్టి పెట్టాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు కిలివేటి సంజీవయ్య తెలిపారు.

చెరువులు ఆక్రమణ కాకుండా చూడండి

ఎమ్మెల్యే కిలివేటి

పెళ్లకూరు, అక్టోబరు 18  : మండలంలో అనేక చెరువులు ఆక్రమణకు గురవుతున్నందున  ఆ సమస్యపై అధికారులు దృష్టి పెట్టాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు కిలివేటి సంజీవయ్య తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడుతూ మండలంలోని స్వయం సహాయక సభ్యుల కోసం వైఎస్‌ఆర్‌ ఆసరా కింద రెండు విడతలు కలిపి రూ. 872 కోట్లు మంజూరు చేశారన్నారు. మండలంలో పీడీఎస్‌ చానళ్ల మరమ్మతుల కోసం 11 కిలో మీటర్లకు రూ. 31.50 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. మండలంలో రూ. 12 కోట్లతో సచివాలయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటికి రూ. 3.5 కోట్లకు బిల్లులు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటిని ఎంపీటీసీలు శాలువాలతో సన్మానించారు.  సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, చిల్లకూరు పీఎసీఎస్‌ అధ్యక్షుడు మద్దాలి సోమశేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ నన్నం ప్రిస్కిల్లా, నాయుడుపేట మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ ఒట్టూరు రాధకిశోర్‌యాదవ్‌, తహసీల్దారు కటారి జయజయరావు, ఎంపీడీవో ప్రమీలారాణి, వ్యవసాయాధికారిణి జి. ప్రవీణ, వైసీపీ మండల కన్వీనర్‌ మారాబత్తిన సుధాకర్‌, వైసీపీ నాయకులు పీవీ రమణయ్యనాయుడు, కరణం రఘునాయుడు, పట్టూరు మోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.




Updated Date - 2021-10-19T04:22:18+05:30 IST