అభ్యంతరాలుంటే తెలపండి

ABN , First Publish Date - 2022-01-29T06:53:12+05:30 IST

జిల్లాల పునర్‌ వ్యవస్థీరణపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 25వ తేదీలోపు తెలియజేయాలని కలెక్టర్‌ సి హరికిరణ్‌ తెలిపారు.

అభ్యంతరాలుంటే తెలపండి

  • జిల్లాల పునర్‌ వ్యవస్థీరణపై వచ్చేనెల 25 వరకు వినతుల స్వీకరణ
  • ప్రకటన జారీచేసిన జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌

కాకినాడ సిటీ, జనవరి 28 : జిల్లాల పునర్‌ వ్యవస్థీరణపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 25వ తేదీలోపు తెలియజేయాలని కలెక్టర్‌ సి హరికిరణ్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఆయన ఒక ప్రకటన జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. అందుకనుగుణంగా ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాను కాకినాడ ప్రధాన కేంద్రంగా కాకినాడ జిల్లాగాను, అమలాపురం ప్రధాన కేంద్రంగా కోనసీమ జిల్లాగానూ, రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమహేంద్రవరం, కొవ్వూ రు డివిజన్‌ మండలాలను చేర్చి తూర్పుగోదావరి జిల్లాగానూ, రంపచోడవరం నియోజకవర్గ 11 మండలాలు, అరకు, పాడేరు నియోజకవర్గాల మండలాలతో కలిపి పాడేరు ప్రధాన కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా నామకరణం చేశారన్నారు. దీనిపై పునర్‌ వ్యవస్థీకరణ ప్రతిపాదిస్తూ ఇప్పటికే జిల్లా గెజిట్‌లో నోటిఫికేషన్‌ జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, సదరు అభ్యంతరాలను వచ్చే నెల ఫిబ్రవరి 25లోపు తమకు సమర్పించాలని కలెక్టర్‌ తెలియజేశారు. 

Updated Date - 2022-01-29T06:53:12+05:30 IST