సయాటికా దారికొచ్చిందిలా..

ABN , First Publish Date - 2020-12-22T20:21:28+05:30 IST

వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టు అయిన ఓ మహిళ సయాటికా నొప్పితో కాలు కదపలేని స్థితికి చేరుకుంది. అల్లోపతి, ఆయుర్వేద చికిత్సలతో నొప్పి ఏమాత్రం తగ్గకపోగా నడవలేని స్థితికి

సయాటికా దారికొచ్చిందిలా..

ఆంధ్రజ్యోతి(22-12-2020)

వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టు అయిన ఓ మహిళ సయాటికా నొప్పితో కాలు కదపలేని స్థితికి చేరుకుంది. అల్లోపతి, ఆయుర్వేద చికిత్సలతో నొప్పి ఏమాత్రం తగ్గకపోగా నడవలేని స్థితికి చేరుకుంది. అయితే ఈ సమస్యను హోమియో వైద్యంతో రెండు వారాల్లో తగ్గించ వచ్చంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ మధు వారణాసి.


ఆ మహిళా రోగిని ఇద్దరు వ్యక్తులు మోసుకుంటూ నా దగ్గరకు తీసుకువచ్చారు. సమస్య గురించి అడిగినప్పుడు.... ‘రెండేళ్ల నుంచీ బాధపడుతున్నాను. నడుము నుంచి కాలి దాకా నొప్పితో కాలు కదపలేకపోతున్నాను. నొప్పి కొరుకుతున్నట్టుగా, షాక్‌ కొట్టినట్టు వస్తోంది. తుంటిలో మొదలై తొడ వెనక భాగానికి పాకుతోంది’ అని బాధలు చెప్పుకొచ్చిందామె. 


నిర్థారణ పరీక్షలు

ఎమ్మారై లంబార్‌ స్పైన్‌, ఎక్స్‌రే ఎల్‌ఎస్‌ స్పైన్‌, సీఆర్‌పీ, సీబీపీ పరీక్షలు చేయించాను.


హోమియో చికిత్స

ఆ మహిళా రోగి వ్యక్తిత్వం, లక్షణాలను బట్టి ఓఅఔఐఆఐఇఏ 200 పొటెన్సీలో మూడు డోసులు ఇచ్చాను. దాంతో పాటు ఎూఅ్కఏఅఔఐ్ఖక మదర్‌ టింక్చర్‌ను రోజుకు రెండుసార్లు పది చుక్కల చొప్పున వేసుకోమన్నాను. తిరిగి పది రోజుల తర్వాత రమ్మని చెప్పాను. 


తీసుకోవలసిన జాగ్రత్తలు

సయాటికా ఉన్న కాలును కొంచెం ఎత్తులో పెట్టి విశ్రాంతి తీసుకోవాలని చెప్పాను. కాలుపై బరువు పెట్టకూడదనీ, 5 కిలోలకు మించి బరువులు ఎత్తకూడదనీ, 70 కిలోల నుంచి శరీర బరువులో 10 కిలోలు తగ్గాలనీ సూచించాను. 


రెండు వారాల తర్వాత...

రెండు వారాల తర్వాత ఆ మహిళా రోగి నెమ్మదిగా నడుచుకుంటూ సంతోషంగా నా దగ్గరకు వచ్చారు. నొప్పి 40ు తగ్గిందనీ, తిమ్మిరి, మంట, సాక్‌ లాగా వచ్చే నొప్పి తగ్గుముఖం పట్టిందనీ, నడుము పట్టుకోవడం కూడా కొంచెం తగ్గిందనీ చెప్పారు. తిరిగి బ్రయోనియా 1ఎం పొటెన్సీలో ఒక డోసు ఇచ్చి పంపించాను. మరో రెండు వారాల తర్వాత తిరిగి రమ్మన్నాను. ఇలా నాలుగు వారాల తర్వాత ఎవరి సహాయం లేకుండా ఆ రోగి తనంతట తాను నడవగలిగే స్థితికి వచ్చింది. 


శస్త్రచికిత్స లేకుండానే....

అల్లోపతి వైద్యవిధానంలో నొప్పి తగ్గడానికి మాత్రలు, ట్రాక్షన్‌లు లాంటివి చేసి, చివరగా శస్త్రచికిత్స చేస్తారు. దీంతో తాత్కాలిక ఉపశమనం కలిగినా తిరిగి నొప్పి మొదలవుతుంది. శస్త్రచికిత్సతో వ్యాధికి ఉన్న అడ్డంకులు తొలగించవచ్చు కానీ మూలకారణాన్ని గుర్తించలేరు. హోమియోపతి ప్రకృతి నియమాలపై ఆధారపడి మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయడం వల్ల సమస్య మూలాలు తొలగించవచ్చు. సయాటికా కాలి నొప్పి సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న ఆ మహిళ హోమియోవైద్యానికి అభిమానిగా మారింది.


డాక్టర్‌ మధు వారణాసి, ఎం.డి,

ప్రముఖ హోమియో వైద్య నిపుణులు,

ప్లాట్‌ నంబరు:188, వివేకానందనగర్‌ కాలనీ,

కూకట్‌పల్లి, హైదరాబాద్‌.

ఫోన్‌: 8897331110, 8886509509


Updated Date - 2020-12-22T20:21:28+05:30 IST