కార్మిక నాయకుడు మోహన్‌రెడ్డి మృతి

ABN , First Publish Date - 2020-10-30T10:06:03+05:30 IST

కార్మిక నాయకుడు, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్‌బీ మోహన్‌రెడ్డి గురువారం తెల్లవారు జామున మృతిచెందా రు.

కార్మిక నాయకుడు మోహన్‌రెడ్డి మృతి

ముషీరాబాద్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): కార్మిక నాయకుడు, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్‌బీ మోహన్‌రెడ్డి గురువారం తెల్లవారు జామున మృతిచెందా రు. ఆయన వయస్సు 78 ఏళ్లు. ఆయనకు భార్య ఒక కుమారుడు ఉన్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో మోహన్‌రెడ్డి రెండోవాడు. ఆరు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతు న్న మోహన్‌రెడ్డిని ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నాయిని నర్సింహారెడ్డి మొదటిసారి 1978లో ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఎస్‌బీ మోహన్‌రెడ్డి ఆయన విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. అలాగే వీ ఎస్‌టీ కంపెనీలో నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షుడిగా ఉండగా 8 ఏళ్లు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వీఎ్‌సటీలో తిరుగులేని కార్మిక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.


ఆయన హయాంలో సుమారు 700 మందికిపైగా కొత్త వారికి వీఎ్‌సటీలో ఉద్యోగం ఇప్పించారు. దయారా మార్కెట్‌లోని విజయ యువజన సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ సం ఘం కార్యాలయం కోసం భూమిని దానం చేశాడు. జవహర్‌నగర్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా, రాంనగర్‌లోని సీతారామ దేవాలయానికి, జెమిని కాలనీ పోచమ్మ దేవాలయానికి చైర్మన్‌గా పనిచేశారు. ఎస్‌బీ మోహన్‌రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ రావివెంకట్‌రెడ్డిలతో పాటు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, టి.రాజేశ్వర్‌రావు, వి.సురేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నేత శ్రీనివాస్‌, మల్లికార్జున్‌రెడ్డి సయ్యద్‌ అస్లాంతో పాటు వీఎస్టీ కార్మికులు నివాళులర్పించారు. ఆయన అంత్య క్రియలు బాపూజీనగర్‌లోని హిందూ శ్మశాన వాటికలో జరిగాయి.

Updated Date - 2020-10-30T10:06:03+05:30 IST