Abn logo
Aug 1 2021 @ 01:03AM

ఎస్‌బీఐ మాన్‌సూన్‌ ధమాకా ఆఫర్‌

ఆగస్టు చివరి వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపు 

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మాన్‌సూన్‌ ధమాకా ఆఫర్‌ ప్రకటించింది. ఆగస్టు 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ రుసుమును మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం బ్యాంక్‌ గృహ రుణ మొత్తంపై 0.40 శాతం ప్రాసెసింగ్‌ చార్జీ వసూలు చేస్తోంది. ఈ ఆఫర్‌తో గృహ రుణగ్రహీతలకు గణనీయంగా లబ్ధి చేకూరనుందని, గృహ కొనుగోలుదారుల్లో సెంటిమెంట్‌ మరింత మెరుగుపడేందుకు దోహదపడనుందని ఎస్‌బీఐ ఎండీ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. ఎస్‌బీఐ గృహ రుణాలపై కనీస వార్షిక వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంది.