ఎస్‌బీఐ... జులై నుంచి ఆ నిబంధనల్లో మార్పులు...

ABN , First Publish Date - 2021-06-13T22:20:13+05:30 IST

ఏటీఎం, నగదు ఉపసంహరణ నియమనిబంధనలను మార్చేందుకు దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సిద్ధమైంది.

ఎస్‌బీఐ... జులై నుంచి ఆ నిబంధనల్లో మార్పులు...

ముంబై : ఏటీఎం, నగదు ఉపసంహరణ నియమనిబంధనలను మార్చేందుకు దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సిద్ధమైంది. ఈ కొత్త నిబంధనలు జూలై నుండి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కస్టమర్లకు బ్యాంకు పలు సూచనలు చేసిందని తెలుస్తోంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడీ) అకౌంట్లకు కొత్త ఛార్జీల అమలుతో పాటు ఏటీఎం ల నుంచి నగదు ఉపసంహరణ ఛార్జీలు, చెక్కు బుక్కులు, ఆర్థికేతర లావాదేవీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. 


బీఎస్‌బీడీ ఖాతాదారులు ప్రతి నెలా ఏటీఎంలు, బ్యాంక్ శాఖలతో సహా నాలుగుసార్లు ఉచితంగా న‌గ‌దును ఉపసంహరించుకోవచ్చు. ఉచిత ఉపసంహరణ పరిమితి దాటితే ప్రతీ లావాదేవీకి రూ. 15 చొప్పున ఛార్జీని  విధిస్తంది. దీనికి జీఎస్‌టీ అదనం. అయితే ఈ బీఎస్‌బీడీ అకౌంట్ హోల్డ‌ర్లకు ఆర్థిక సంవత్సరంలో పది చెక్కు బుక్స్‌ను బ్యాంకు అందిస్తుంది. అటుపై అందించే చెక్కుల‌పై నిర్ధిష్ట ఛార్జీని వసూలు చేస్తుంది. 


చెక్కు బుక్కులపై... పది చెక్కు బుక్కులకు బ్యాంకు రూ. 40 తో పాటు జీఎస్‌టీ వసూలు చేస్తుంది. ఈ క్రమంలో... 25 చెక్కుబుక్కులకు బ్యాంకు రూ. 75 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. పది ఎమర్జన్సీ చెక్కు బుక్కులకు రూ. 50 తో పాటు జీఎస్టీ వసూలు చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు చెక్కు బుక్కులకు సంబంధించి కొత్త సర్వీస్ ఛార్జీల నుండి మినహాయింపు ఉంటుంది. అకౌంట్ హోల్డర్ హోం బ్రాంచీ లేదా ఇతర బ్రాంచీలలో ఆర్థికేతర లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలనూ విధించబోరు. నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. 

Updated Date - 2021-06-13T22:20:13+05:30 IST