కరోనా బాధితులకు... ఎస్‌బీఐ వెసులుబాటు...

ABN , First Publish Date - 2021-06-12T01:18:17+05:30 IST

కరోనా బాధితులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీఐ) అండగా నిలవనుంది. ఈ క్రమంలోనే... ‘కవాచ్ పర్సనల్ లోన్’ ను ప్రారంభించింది.

కరోనా బాధితులకు... ఎస్‌బీఐ వెసులుబాటు...

హైదరాబాద్ : కరోనా బాధితులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీఐ) అండగా నిలవనుంది. ఈ క్రమంలోనే... ‘కవాచ్ పర్సనల్ లోన్’ ను ప్రారంభించింది. కరోనా రోగులు... చికిత్స కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు.  ఈ వ్యక్తిగత రుణం రూ. 5 లక్షల వరకు ఉంటుంది. వడ్డీ రేటు కేవలం 8.5 % మాత్రమే. కవాచ్ పర్సనల్ లోన్‌ను ఎస్‌బిఐ హెడ్ దినేష్ ఖారా శుక్రవారం ప్రారంభించారు. ఈ రుణం... రూ. 25 వేలు-రూ. 5 లక్షల వరకు ఉంటుంది. రుణాన్ని ఐదు సంవత్సరాల వ్యవధిలో తీర్చివేయాల్సి ఉంటుంది. 


ఇందులో మూడు నెలల తాత్కాలిక నిషేధం కూడా ఉంది. తాత్కాలిక నిషేధ సమయంలో ఈఎంఐలను జమ చేయలేకపోయినప్పటికీ... చర్యలుండవు. ఈ రుణం... ‘అనుషంగిక రహితం’గా ఉంటుంది. అంటే ఈ రుణానికి వ్యతిరేకంగా ఏదైనా తనఖా పెట్టమని బ్యాంక్ అడగబోదు. వ్యక్తిగత రుణాల విభాగంలో ఇది చౌకైన రుణం. ఈ పథకం కింద... ఇంతకుముందు కరోనా చికిత్స చేయించుకున్నపక్షంలో... అందుకు సంబంధించిన ‘రీ ఇంబర్స్‌మెంట్’ తీసుకుని ఉన్నపపక్షంలో... దానిని కూడా చేరుస్తారు.


ఈ సందర్భంగా దినేష్ ఖారా మాట్లాడుతూ... ‘కరోనా బారిన పడుతున్న వారికి ఆర్థికసాయం కోసం ఈ రుణన సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది’ అని పేర్కొన్నారు. కాగా... జీతం లేనివారికి కూడా రుణాలు అందుబాటులో ఉండడం ఈ పథకం ప్రత్యేకత. 

Updated Date - 2021-06-12T01:18:17+05:30 IST