కరోనా చికిత్స ఖర్చుల కోసం ఎస్‌బీఐ కవచ్‌ పర్సనల్‌ లోన్‌

ABN , First Publish Date - 2021-06-12T05:59:55+05:30 IST

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ) సరికొత్త వ్యక్తిగత రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌బీఐ కవచ్‌ పర్సనల్‌ లోన్‌ పేరుతో కొవిడ్‌-19 చికిత్స ఖర్చుల కోసం రూ.5

కరోనా చికిత్స ఖర్చుల కోసం ఎస్‌బీఐ కవచ్‌ పర్సనల్‌ లోన్‌

 8.5 శాతం వడ్డీకే రూ.5 లక్షల వరకు రుణం 


ముంబై: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ) సరికొత్త వ్యక్తిగత రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌బీఐ కవచ్‌ పర్సనల్‌ లోన్‌ పేరుతో కొవిడ్‌-19 చికిత్స ఖర్చుల కోసం రూ.5 లక్షల వరకు రుణం ఆఫర్‌ చేస్తోంది. అదీ ఎలాంటి తనఖా లేకుండా. పైగా 8.5 శాతం వార్షిక వడ్డీ రేటుకే. వ్యక్తిగత రుణ విభాగంలో ఇప్పటివరకిదే కనిష్ఠ వడ్డీ రేటని ఎస్‌బీఐ అంటోంది.


5 ఏళ్ల (60 నెలలు) కాలపరిమితితో కూడిన ఈ రుణంపై 3 నెలల మారటోరియం కూడా ఆఫర్‌ చేస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల కరోనా చికిత్స అవసరాలకు ఈ రుణాన్ని పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ రుణ పథకంలో ఇప్పటికే వెచ్చించిన కొవిడ్‌ వైద్య ఖర్చులకు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు శుక్రవారం ఎస్‌బీఐ పేర్కొంది. 


Updated Date - 2021-06-12T05:59:55+05:30 IST