ఏలూరుపాడు ఘటన దురదృష్టకరం

ABN , First Publish Date - 2021-12-07T05:04:17+05:30 IST

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పుడు కులాల మధ్య విద్వేషాలు ఎందుకని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు.

ఏలూరుపాడు ఘటన దురదృష్టకరం
ఏలూరుపాడులో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన విక్టర్‌ ప్రసాద్‌

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌

కాళ్ళ, డిసెంబరు 6 : రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పుడు కులాల మధ్య విద్వేషాలు ఎందుకని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం కాళ్ల మండలం ఏలూరుపాడులో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల గ్రామంలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. దోషులను తక్షణం అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతియుతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని కోరారు. అర్హులందరికీ తక్షణం కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, తహసీల్దార్‌ టీఏ కృష్ణారావు, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గోకరాజు రామరాజు,సర్పంచ్‌ భూపతిరాజు జగ్గరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-07T05:04:17+05:30 IST