కులం పేరుతో దూషించారని ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-01T06:27:33+05:30 IST

తనను కులంపేరుతో దూషించి, దాడిచేశారని వాడపాలెం పెదపేటకు చెందిన గూడపాటి వినయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కులం పేరుతో దూషించారని ఫిర్యాదు

కొత్తపేట, ఫిబ్రవరి 28: తనను కులంపేరుతో దూషించి, దాడిచేశారని వాడపాలెం పెదపేటకు చెందిన గూడపాటి వినయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితుడు యడ్ల ఆనందకుమార్‌తో కలిసి కొత్తపేట వచ్చి తిరిగి అగ్రహారం మీదుగా వెళ్తుండగా తనను సిద్దంశెట్టి శివాజీ ఎదురుగా వచ్చి మోటారుసైకిల్‌తో ఢీకొట్టగా కిందపడిపోయామని, శివాజీ తనను కులంపేరుతో దూషించి, కర్రతో దాడిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎల్‌.శ్రీనునాయక్‌ తెలిపారు.

Updated Date - 2021-03-01T06:27:33+05:30 IST