Abn logo
Oct 14 2021 @ 21:59PM

తిరుమల బ్రహ్మోత్సవాలకు భక్తుల తరలింపు

తిరుమలకు వెళుతున్న భక్తులు

గూడూరు, అక్టోబరు 14: తిరుమలలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు టీటీడీ సహకారంతో  ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార భక్తులను ఉచితంగా తీసుకువెళుతున్నట్లు సమరసతా ఫౌండేషన్‌ ప్రతినిధి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం పోటుపాళెం నుంచి 50మంది భక్తులు తిరుమలకు బయలుదేరివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యదర్శనం పథకం ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

రాపూరు: తిరుమల బ్రహ్మోత్సవాలను దర్శించుకునేందుకు సమరతసేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సుమారు 160మంది   గురువారం నాలుగు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు. శ్రీవారి దర్శనంతోపాటు, భోజన వసతి కల్పిస్తున్నట్లు  మండల కన్వీనర్‌ గణపతి, దందోలు వెంకటరెడ్డి తెలిపారు. తొలుత మహావిష్ణువు, అయ్యప్పను దర్శించుకుని యాత్రను ప్రారంభించారు.