దిష్టిబొమ్మలు.. గ్రామ సచివాలయ నూతన భవనాలు

ABN , First Publish Date - 2021-06-14T06:47:38+05:30 IST

ప్రభుత్వం గ్రామస్థాయిలో ఎంతో ఆర్భాటంగా చే పట్టిన గ్రామ సచివాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ముతో నూతన భవనాలు నిర్మించినా... ప్రారంభించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.

దిష్టిబొమ్మలు.. గ్రామ సచివాలయ నూతన భవనాలు
కణేకల్లులో పూర్తయిన గ్రామ సచివాలయ భవనం

రూ.లక్షలు వెచ్చించి నిర్మించారు.. ప్రారంభించడం మరిచారు


కణేకల్లు, జూన 13 : ప్రభుత్వం గ్రామస్థాయిలో ఎంతో ఆర్భాటంగా చే పట్టిన గ్రామ సచివాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ముతో నూతన భవనాలు నిర్మించినా... ప్రారంభించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. నేటికీ అసంపూర్తి నిర్మాణాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయ. ఫలితంగా అద్దె భవనాల్లో అరకొ ర వసతుల నడుమ కార్యకలాపాల నిర్వహణకు సచివాలయ సిబ్బంది తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలకు స క్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో పలు గ్రామాల్లో నూతన భవనాలు ప్రారంభానికి నోచుకోక అలంకార ప్రాయంగా మారాయి.  


ఒక్కో భవన నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు

మండలవ్యాప్తంగా 20 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే గోపులాపురం, పూలచెర్ల, బెణకల్లు, కళేకుర్తి, రచ్చుమర్రి, మాల్యం, బ్రహ్మసముద్రం, కణేకల్లు-2తో పాటు పలు సచివాలయాలు అన్ని హంగులతో పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా వున్నాయి. కాగా కొన్ని భవనాల కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో నిలిచిపోయాయి. మరికొన్ని స చివాలయాలు లింటెల్‌ స్థాయిలోను, స్లాబ్‌లు పూర్తయి ఫినిషింగ్‌ వర్క్‌కు సిద్ధంగా వున్నాయి. కొన్ని దశల్లో ఇసుక కొరత రావడంతో పనులు నత్తనడకన కొనసాగినప్పటికీ, ఆ తరువాత ఇసుక కూడా సక్రమంగా దొరకడంతో పలు భవనాలు శరవేగంగా పూర్తయ్యాయి. చాలా చోట్ల భవనాలు పూర్తయి ఆరు నెలలు కావస్తున్నా ప్రారంభానికి నోచుకోకపోవడం శోచనీయం. 


అద్దె భవనాల్లో సచివాలయ సిబ్బంది అవస్థలు 

కణేకల్లులోని 2, 3, 4 సచివాలయాలతో పాటు పలు గ్రామాల్లో సచివాలయ భవనాలు అద్దె గదుల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నూతన స చివాలయ భవనాల్లో ప్రతి శాఖకు ప్రత్యేక వసతులతో నిర్మించారు. అయితే అద్దె భవనాల్లో కేవలం ఒక గదిలోనే అన్ని శాఖల సిబ్బంది కూర్చోవాల్సి వ స్తోంది. దీంతో విధుల నిర్వహణ సక్రమంగా సాగడం లేదన్న విమర్శలు న్నాయి.     ఎంతో ఆర్భాటంగా లక్షలాది రూపాయల నిధులతో నిర్మించిన గ్రా మ సచివాలయ భవనాలను దిష్టిబొమ్మల్లా వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సచివాలయ నూతన భవనాలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలని పలువురు కోరుతున్నారు. 


త్వరలోనే ప్రారంభిస్తాం: చెంచులయ్య, పీఆర్‌ జేఈ

మండలవ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో సచివాలయ నూతన భవన నిర్మా ణాలు పూర్తయ్యాయి. వాటిని వెంటనే ప్రారంభించాలని ఉన్నతాధికారుల నుంచి కూడా ఆదేశాలు అందాయి. ఇప్పటికే పూర్తయిన సచివాలయ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. పలు దశల్లో నిర్మాణంలో వున్న భవనాలను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. 



Updated Date - 2021-06-14T06:47:38+05:30 IST