Abn logo
Oct 30 2020 @ 11:46AM

ప్రసవించిన బాలిక శిశువును ఫ్రీజరులో దాచింది...

Kaakateeya

నోవోసిబిర్క్సు(రష్యా):  గర్భం దాల్చిన 14 ఏళ్ల పాఠశాల బాలిక ప్రసవించడంతో తల్లిదండ్రులకు భయపడి నవజాత శిశువును ఫ్రీజరులో దాచిన దారుణ ఘటన రష్యా దేశంలో వెలుగుచూసింది. రష్యాలోని సైబీరియా ప్రాంత నోవోసిబిర్క్సు నగరానికి సమీపంలోని వర్ద్  తులా గ్రామానికి చెందిన 14 ఏళ్ల పాఠశాల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఇంట్లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు ప్రసవించిన బిడ్డ గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడిన బాలిక నవజాత శిశువును ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఆమె తండ్రి తోట పనిలో ఉన్నపుడు గ్యారేజీ ఫ్రీజరులో దాచింది. 

బాలిక ప్రసవించిన తర్వాత రక్తస్రావం చూసి ఆమె తల్లి తన కూతురు అపెండిసైటిస్ తో బాధపడుతుందని అంబులెన్సను ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చేరిన బాలిక తనకు జన్మించిన నవజాత శిశువును ఫ్రీజరులో ఉంచానని చెప్పడంతో వెళ్లి చూడగా ఆ శిశువు మరణించి ఉంది. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

Advertisement
Advertisement