Abn logo
Oct 30 2020 @ 15:00PM

ప్రియుడిని పెళ్లాడిన స్కార్లెట్ జాన్సన్!

Kaakateeya

హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా కూడా స్కార్లెట్ ప్రాచుర్యం పొందింది. ఈ అమ్మడు తన చిరకాల ప్రియుడు కోలిన్ జోస్ట్‌ని తాజాగా వివాహం చేసుకుంది.


కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో చాలా సింపుల్‌గా స్కార్లెట్ వివాహ వేడుక పూర్తయిందట. గతేడాది మే నెలలో స్కార్లెట్, కోలిన్ నిశ్చితార్థం జరిగింది. అంతకు ముందు నుంచే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా సింపుల్‌గానే పెళ్లి వేడుకను పూర్తి చేశారు. 

Advertisement
Advertisement