చిన్నారి లిషితకు అభినందనలు

ABN , First Publish Date - 2021-03-02T05:37:34+05:30 IST

పట్ట ణానికి చెందిన చిన్నారి లిషితకు ఫైర్‌ లింబో స్కేటింగ్‌లో వరల్డ్‌ రికార్డు సాధించిన సందర్భంగా వావిలాల వెంకటరమేష్‌, సరళాదేవి దంపతులు చిన్నారిని అభినందించారు.

చిన్నారి లిషితకు అభినందనలు

తణుకు, మార్చి1: పట్ట ణానికి చెందిన చిన్నారి లిషితకు ఫైర్‌ లింబో స్కేటింగ్‌లో వరల్డ్‌ రికార్డు సాధించిన సందర్భంగా వావిలాల వెంకటరమేష్‌, సరళాదేవి దంపతులు చిన్నారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లిషిత చిన్న వయస్సులోనే గొప్ప పేరు సంపాదించి, తణుకు పట్టణాన్ని రాష్ట్రస్థాయిలో చూపిందన్నారు. ఈ విజయానికి కారణమైన లిషిత తల్లిదండ్రులను, కోచ్‌ లావణ్యను సత్కరించి, జ్ఞాపికను వావిలాల ట్రస్ట్‌ ద్వారా అందించారు. ఆకుల వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్‌ రామకృష్ణ, ఆమరాతి శ్రీనివాస్‌, ఆనందం రాము, ఆనందం వెంకట్‌, గనిశెట్టి కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:37:34+05:30 IST