‘స్కూల్‌ గేమ్స్‌’ పాలకమండలి రద్దు

ABN , First Publish Date - 2020-02-28T09:57:03+05:30 IST

బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎ్‌ఫఐ) పాలకమండలిని రద్దు చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

‘స్కూల్‌ గేమ్స్‌’ పాలకమండలి రద్దు

వైఎంసీఏ/ హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎ్‌ఫఐ) పాలకమండలిని రద్దు చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో 2017 డిసెంబరులో జరిగిన పసిఫిక్‌ స్కూల్‌ గేమ్స్‌లో ఎస్‌జీఎ్‌ఫఐ నిర్లక్ష్యం వల్ల నితీషా నేగీ అనే 15 ఏళ్ల ఫుట్‌బాలర్‌ ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో పాటు భారత్‌ నుంచి తీసుకెళ్లిన 187 మంది బృందాన్ని ఎస్‌జీఎ్‌ఫఐ అధికారులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. వీటి గురించి ఎస్‌జీఎ్‌ఫఐను కేంద్ర క్రీడాశాఖ సంజాయిషీ అడగ్గా వారి నుంచి సరైన జవాబు లభించకపోవడంతో పాలకమండలిపై వేటు పడింది.

Updated Date - 2020-02-28T09:57:03+05:30 IST