ఆ రాష్ట్రాల్లో ఈరోజు నుంచి తెరుచుకున్న స్కూళ్లు!

ABN , First Publish Date - 2021-08-02T14:38:13+05:30 IST

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో...

ఆ రాష్ట్రాల్లో ఈరోజు నుంచి తెరుచుకున్న స్కూళ్లు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, లాక్‌డౌన్ ఆంక్షలను కూడా సడలిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లోని స్కూళ్లను ఈరోజు నుంచి తెరుస్తున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలోని స్కూళ్లను ఈరోజు నుంచి తెరుస్తున్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు ప్రత్యేక గైడ్‌లైన్స్ విడుదల చేశాయి. వీటిని తప్పక పాటించాలని ఆదేశాలు జారీచేశాయి. పాఠశాల సిబ్బంది తప్పనిసరిగా కరోనా టీకా తీసుకోవాలి. ప్రాథమిక తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సివుంటుంది.  ఉత్తరాఖండ్‌లో ఈరోజు నుంచి 9 నుంచి 12 వరకూ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఆరు నుంచి ఎనిమిది వరకూ చదువుకునే విద్యార్థులు ఆగస్టు 16 నుంచి స్కూళ్లకు హాజరు కావాల్సివుంటుంది. జార్ఖండ్‌లోనూ ఈరోజు నుంచి 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం స్కూళ్లను తెరిచారు.

Updated Date - 2021-08-02T14:38:13+05:30 IST