Advertisement
Advertisement
Abn logo
Advertisement

బెల్లీ డాన్స్ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న టీచర్.. విడాకులిచ్చిన భర్త

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. ఓ టీచర్ జీవితాన్నే నాశనం చేసింది. ఆ వీడియో కారణంగా ఒకవైపు ఆమె ఉద్యోగం కోల్పోగా.. మరోవైపు ఆమె భర్త విడాకులు ఇచ్చేశాడు.


వివరాల్లోకి వెళితే.. ఈజిప్ట్‌కు చెందిన అయా యూసఫ్ అనే టీచర్ తన సహోద్యోగులతో కలిసి విహార యాత్రకు వెళ్లింది. ఆ సందర్భంగా తన సహచరులతో కలిసి సరదాగా బెల్లీ డ్యాన్స్ వేసింది. అదే ఆమె పాలిట శాపంలా మారింది. ఆమె బెల్లీ డ్యాన్స్‌ చేస్తుండగా.. సహోద్యోగి ఆ సన్నివేశాన్ని వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మహిళలు బహిరంగంగా డ్యాన్స్ వేయడంపై అక్కడి ప్రజలు తీవ్రంగా విమర్శించారు.


అయితే, ఆ వీడియో అయా యూసుఫ్ పనిచేసే పాఠశాల యజమాన్యం కంట పడింది. వారు దీనిపై సీరియస్ అయి ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ షాక్ ఇలా ఉండగానే.. ఆమె భర్త మరో ఊహించని షాక్ ఇచ్చాడు. డ్యాన్స్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పరిణామాలతో ఆమెకు తీవ్ర మనోవేదనకు గురైంది. సహోద్యోగి తన అనుమతి లేకుండా వీడియో చిత్రీకరించాడని యూసఫ్ ఆరోపించింది. నైలు నదిలో పది నిమిషాల ప్రయాణం నా జీవితాన్నే అస్తవ్యస్థం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తానేం బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేయలేదని వివరణ ఇచ్చుకుంది. 


ప్రస్తుతం అయా యూసుఫ్‌కు మద్దతుగా ఈజిప్టు మహిళా సంఘాలు ముందుకు వచ్చాయి. మహిళపై ఇది వివక్ష చూపడమే ఆమెను ఉద్యోగం నుంచి తీసేసిన స్కూల్ యజమాన్యంపై కేసు పెట్టాయి.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement