Hyderabad: సనత్‎నగర్‎లో స్కూల్ వాచ్‎మెన్ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-07-16T17:26:41+05:30 IST

నగరంలోని సనత్‎నగర్‎లో స్కూల్ వాచ్‎మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో వాచ్‎మెన్‎గా పని చేస్తున్న వేముల వెంకటేష్‎ను గుర్తు తెలియని...

Hyderabad: సనత్‎నగర్‎లో స్కూల్ వాచ్‎మెన్ దారుణ హత్య

హైదరాబాద్: నగరంలోని సనత్‎నగర్‎లో స్కూల్ వాచ్‎మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో వాచ్‎మెన్‎గా పని చేస్తున్న వేముల వెంకటేష్‎ను గుర్తు తెలియని దుండగులు ఇనుప రాడ్‎తో మోది హత్య చేశారు. ఈ ఘటన ఫతేనగర్‎లోని ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు.

Updated Date - 2021-07-16T17:26:41+05:30 IST