piercing infection పియర్సింగ్ మోజులో యువతి మృతి!

ABN , First Publish Date - 2021-07-11T12:05:09+05:30 IST

piercing infection బ్రెజిల్‌కు చెందిన 15 ఏళ్ల యువతి పియర్సింగ్...

piercing infection పియర్సింగ్ మోజులో యువతి మృతి!

బ్రసీలియా: piercing infection బ్రెజిల్‌కు చెందిన 15 ఏళ్ల యువతి పియర్సింగ్(కుట్టించుకోవడం) మోజులో ప్రాణాలు పోగొట్టుకుంది. ఇసాబెల్లా ఎడ్వర్డా డిసౌజా అనే ఈ యువతి తన కంటి పైరెప్పలను కుట్టించుకోవడంతో మృతి చెందింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇసాబెల్లా తన కంటి రెప్పలను కుట్టించుకోవడంతో ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఫలితంగా ఆమె ముఖం బెలూన్ మాదిరిగా ఉబ్బిపోయింది. కళ్లు విపరీతంగా వాచిపోయాయి. చివరికి ఆమె ప్రాణాలను కోల్పోయింది. 


మినాస్ గెరైస్ ప్రాంతంలో ఉంటున్న ఈ యువతి తన ఇంటిలోనే ఒక స్నేహితురాలి సాయంతో తన పైకనురెప్పలను అలంకరణ కోసం కుట్టించుకోవానుకుంది. ఇందుకోసం కనురెప్పలకు రంధ్రాలు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఎంతవారిస్తున్నా ఆమె కను రెప్పలను కుట్టించుకుంది. అయితే ఈ ప్రయోగం వికటించి, ఆమె కనురెప్పలకు ఇన్ఫెక్షన్ సోకింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. అక్కడ చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఇసాబెల్లా ఎడ్వర్డా డిసౌజా కన్నుమూసింది. 

Updated Date - 2021-07-11T12:05:09+05:30 IST